Switch to English

ఆపరేషన్ పిఠాపురం: ఒక్కని ఓటమి కోసం.. వంద వ్యూహాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఒక్క పవన్ కళ్యాణ్‌ని ఓడించేందుకు, వైసీపీ అనుసరిస్తున్న వంకర వ్యూహాలు, అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇప్పుడేమో పిఠాపురం.. ఇదో పెద్ద ప్రసహనంగా తయారైంది వైసీపీకి.!

ప్రస్తుతానికైతే కుట్రల కేంద్రం పిఠాపురం.! పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఖాయమవుతుందన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న వైసీపీ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ‘నేను హీరో..’ అంటూ ముద్రగడ పద్మనాభం, వైసీపీలో చేరి, జనసేనాని మీద చేసిన విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఆ ముద్రగడ పద్మనాభం, పిఠాపురం కేంద్రంగా, కాపు నేతల్ని వైసీపీ వైపుకు తిప్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసీపీ సామ ధాన బేధ దండోపాయాలన్నిటినీ అమలు చేస్తోంది. ఈ క్రమంలో పలువురు కాపు నేతలు, వైసీపీ వైపు వెళుతున్నారు.. జనసేనని వీడి మరీ.!

అయితే, ఏం చేసినా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించడం ఖాయమని, స్థానిక వైసీపీ శ్రేణులే భావిస్తున్నాయట. ఈ క్రమంలో తమ వంకర వ్యూహాలకు మరింత పదును పెడుతోంది వైసీపీ.

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎప్పటికప్పుడు పిఠాపురంలో జనసేన పార్టీని ఓడించడంపై తనదైన వ్యూహాల్ని రచిస్తూ వెళుతన్నారు. మండలానికో ఇన్‌ఛార్జిని నియమించింది వైసీపీ, జనసేనని ఓడించడానికి.

అయితే, పిఠాపురం చాలా చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. గతంలో ఇండిపెండెంట్లు కూడా గెలిచిన నియోజకవర్గమిది. అదే సమయంలో, ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ విజయం దక్కింది గతంలో. అందుకే, వైసీపీలో మరింత కంగారు పెరిగింది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తే, తమకు రాజకీయంగా పుట్టగతులు వుండవని భావిస్తున్న వైసీపీ, ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ని ఓడించాలన్న ఉద్దేశ్యంతో అప్పుడే పంపకాలకూ తెరలేపింది.

ఓటుకి పది వేల నుంచి లక్ష వరకు అయినా ఖర్చు పెట్టడానికి వైసీపీ వెనుకాడ్డంలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. మండలానికో ఇన్‌ఛార్జి కాదు, ముందు ముందు గ్రామానికి ఓ ఇన్‌ఛార్జి అయినా వైసీపీ నుంచి నియమితులయ్యే అవకాశాల్లేకపోలేదు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు సహకరించాల్సింది పోయి, తెరవెనుకాల వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

వర్మని ముందుగానే వైసీపీ తన వైపుకు తిప్పుకుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేనాని గెలుపుకి సహకరిస్తానని చెబుతూనే, వర్మ తన మార్కు కుయుక్తుల్ని పన్నుతున్నారు. ఆయన వెకిలి చేష్టల్ని చూసీ చూడనట్టు వదిలేస్తోంది టీడీపీ.

ఇలా తన చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నా.. ఇవేవీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఊహించని విషయాలు కావు. ఎవరెన్ని కుట్రలు పన్నినాగానీ, ‘లక్ష మెజార్టీ..’ అంటూ సంచలన వ్యాఖ్యల చేశారు జనసేనాని ఇటీవలే.!

ఒక్కడ్ని ఓడించేందుకు వైసీపీ పన్నుతున్న ఈ పన్నాగాలన్నీ పటాపంచలవడం ఖాయంగానే కనిపిస్తోంది. 2019లోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి వుండాల్సిందని, ఆయన పోటీ చేసి వుంటే, గెలిపించుకునేవాళ్ళమనీ.. స్థానికంగా పిఠాపురం ఓటర్లు చర్చించుకుంటున్నారంటే, ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఏ రేంజ్‌లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

కుట్రలు, వంకర వ్యూహాలు.. వైసీపీ నుంచి ఎన్నికల పోలింగ్ వరకూ నడుస్తూనే వుంటాయ్. వైసీపీ అనుకూల మీడియా వెకిలితనం, వైసీపీ కోవర్టులు.. దానికి తోడు టీడీపీ నేత వర్మ మార్కు రాజకీయ పైత్యాలు.. ఇలా ఎవరు ఏం చేసినా సరే, 50 వేల మెజార్టీకి తగ్గకుండా జనసేనాని బంపర్ విక్టరీ పిఠాపురం నుంచి నమోదు చేయబోతున్నారన్నది నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...