Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్ షో వేశారు. దీనికి నాని సతీసమేతంగా హాజరై ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అభిమానులతో కలిసి ఎంజాయ్ చేశారు.
‘జెర్సీ వచ్చి 5ఏళ్లైనా అభిమానులు చూపిస్తున్న ఆదరణకు సంతోషంగా ఉంది. మళ్లీ తన జర్నీ కోసం అర్జున్ భూమ్మీదకు వచ్చినట్టుంది. అభిమానులు ప్రేమాభిమానులకు గుండె బరువెక్కుతోంది. ఈ క్షణాలు భావోద్వేగంగా అనిపిస్తున్నా’యని ట్వీట్ చేశారు.
భార్య అంజనా.. ‘జెర్సీ తొలిసారి ధియేటర్లో చూసిన రోజులు మర్చిపోలేను. సినిమాలో సన్నివేశాలు ఎన్నిసార్లు చూసిన భావోద్వేగానికి గురి చేస్తాయి. మా అబ్బాయి ఇప్పుడిప్పుడే థీమ్ సాంగ్ ను పియానోపై ప్లే చేస్తున్నా’డని ఇన్ స్టా పోస్ట్ చేశారు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలో నాని క్రికెటర్ గా నటించారు. తండ్రి, కొడుకు మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నాని కెరీర్ సూపర్ హిట్స్ లో “జెర్సీ’ ఒకటి.
Today it felt like Arjun came back from the skies to relive the journey and say farewell again.
Heart is heavy and full ♥️#5YearsOfJersey #JerseySpecialShows— Hi Nani (@NameisNani) April 20, 2024