Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను పలు వేదికల్లో ఎన్టీఆర్ తో తెరకెక్కించిన రామయ్యా వస్తావయ్యా సినిమాని ఉద్దేశిస్తూ తనని కించపరుస్తున్నారంటూ ఘాటుగా లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
‘చోటా కె.నాయుడుగారికి.. రామయ్యా వస్తావయ్యా వచ్చి పదేళ్లయింది. ఇన్నేళ్లలో మీరు 10ఇంటర్వ్యూలు ఇస్తే.. నేను 100 ఇచ్చాను. కానీ.. మీ గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం అసందర్భంగా నా ప్రస్తావన తీసుకొస్తూ అవమానిస్తున్నారు. మిమ్మల్ని తీసేద్దామనుకుని కూడా మీతో పని చేశాను’.
‘హిట్టొస్తే నేను.. ఫ్లాపొస్తే మీపై నిందలు వేసే వ్యక్తిత్వం కాదు నాది. ఎన్నోసార్లు మౌనంగానే బాధపడ్డా.. ఇప్పుడు నా ఆత్మాభిమానాన్ని తగ్గించుకోవాలని లేదు. మీరు నన్ను బాధపెట్టినా.. మీనుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే మీరంటే గౌరవం ఉంది. ఇక్కడితే విషయం వదిలేయక.. ఇంకా కెలుక్కుంటానంటే.. ఏరోజైనా.. ఏ వేదికపై అయినా.. నేను సిద్ధ’మంటూ ఘాటుగా లేఖ రాశారు.