Switch to English

Ram Charan Birthday special: ‘చిరు’త వేగంతో వచ్చిన చిరు తనయుడు ‘రామ్ చరణ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Ram Charan: ఒక్కడిగా వచ్చి.. ఒక్కటి నుంచి మొదలెట్టి.. ఒక్కోటి సాధించుకుంటూ వెళ్లింది చిరంజీవి (Chiranjeevi). సాధించిన కీర్తి మెగాస్టార్ (Mega Star). ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసింది తనయుడు రామ్ చరణ్ (Ram Charan). పోషించాల్సింది తెరపై హీరో పాత్ర మాత్రమే కాదు.. ప్రేక్షకుల్ని మెప్పించడం, అశేష మెగాభిమానుల అంచనాలు అందుకోవడం, పోటీని తట్టుకుని రేసులో దూసుకెళ్లడం. 17ఏళ్ల క్రితం ‘చిరు’తతో మొదలైన రామ్ చరణ్ వేగం అంతకంతకూ రెట్టింపు అయింది. అలుపెరుగని పరుగులో అనితరసాధ్యమైన విజయాలెన్నో వచ్చాయి. అపజయాలెదురైనా ఆగని.. అలసిపోని వేగం అది. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలం రాష్ట్రం దాటి దేశం.. దేశం దాటి అంతర్జాతీయస్థాయి ఖ్యాతి.. పేరు ప్రఖ్యాతులు. ఇన్నేళ్లలో చేసింది 14 సినిమాలు. అందులో 3 ఇండస్ట్రీ హిట్లు. రామ్ చరణ్ జనరేషన్ హీరోల్లో మరే హీరోకీ లేని అద్భుతమైన రికార్డు ఇది.

తొలి సినిమా నుంచే..

చిరుత సినిమాతో తన మార్క్ మాస్ ఇమేజ్ తోనే తనయుడినీ తెరంగేట్రం చేయించడం రామ్ చరణ్ కు కలిసొచ్చింది. ఓ ప్రేమ కథ.. కాలేజీ నేపథ్యంలో సినిమా చేసి తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా తొలి అడుగే రామ్ చరణ్ లోని పవర్ చూపించారు. డాషింగ్ డైరక్టర్ గా.. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇచ్చే పూరి జగన్నాధ్ తన పవర్ ను పూర్తిగా రామ్ చరణ్ లో చూపించారు. చిరంజీవి కొడుకు ఎలా ఉంటాడో.. ఎలా నటిస్తాడో.. డ్యాన్స్, ఫైట్స్ లో చిరంజీవిని మెప్పిస్తాడా.. అనే యావత్ తెలుగు ప్రేక్షకులు అందరికీ సరైన సమాధానం చెప్పి 100శాతం మెప్పించేశాడు. ఫస్ట్ ఫైట్ చూడగానే చరణే కనిపించేంతలా.. ఫస్ట్ సాంగ్ చూడగానే చిరంజీవి పేరు నిలబెట్టాడనేలా.. నటన చూడగానే తన మార్క్ పడేలా చేసి తొలి విజయాన్ని.. తొలి మెట్టుతోనే ఘనంగా ఎక్కేశాడు రామ్ చరణ్.

అదిరిపోయే లుక్స్..

నటుల్లో ఎవరికైనా తొలి సినిమా నుంచి సినిమా సినిమాకీ.. లుక్స్ మారడం సహజం. కానీ.. రామ్ చరణ్ చిరుతలో ఎంతటి పవర్ ఫుల్ మాస్ లుక్ లో ఉన్నాడో అదే దాదాపుగా ఇప్పటికీ ఉంది. తొలి సినిమా నుంచీ అదే చార్మ్. ఫిట్ నెస్ లో ఖచ్చితత్వం.. చేసే పనిలో నిబద్ధత. క్రమశిక్షణకు మారు పేరు. నటనలో చిరంజీవి నేర్పింది ఏదీ లేదు.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలనే క్రమశిక్షణ తప్ప. అదే మనకి నడవడిక నేర్పిస్తుందని చిరంజీవి చెప్పిన మాటల్ని తూ.చ తప్పకుండా పాటించాడు. ఆ దీక్షా ఫలితమే మెగా పవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ కీర్తి. అభిమానుల పరవశమూ ఇదే. ఎందరికో ఆదర్శమైన చిరంజీవి.. తనయుడికీ ఆదర్శమయ్యారు. రామ్ చరణ్ ద్వారా పుత్రోత్సాహాన్ని పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...