Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్ లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు చిత్ర పరిశ్రమలు కోరుకునే సహకారం.. సినిమా షూటింగ్స్.. ఆతిథ్యం, సృజనాత్మకత.. పరస్పరం ప్రోత్సాహంపై వీరు చర్చించారు.
రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్స్ జరిగితే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చిరంజీవితో అన్నారు. రష్యన్ సినిమా క్రియేటివిటీకి తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి పోలిక ఉందని.. తాము దీనిపై ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. దీని ద్వారా రష్యన్-తెలుగు సినిమా పరిశ్రమల మధ్య బంధం బలోపేతమవ్వాలని వారు ఆకాంక్షించారు. వారు వెల్లడించిన అంశాలపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవితో భేటీ అయిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జులియా గోలుబెవా, ఎకటెరినా జాడే తదితరులు పాల్గొన్నారు. కెరీర్ పరంగా ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్.