అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’: దర్శకుడు మల్లిక్ రామ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,247FansLike
57,764FollowersFollow

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‌ శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

టిల్లు స్క్వేర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నా మొదటి సినిమా నరుడా డోనరుడా. ఆ తర్వాత అద్భుతం అనే సినిమా చేశాను. మధ్యలో పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ కూడా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. డీజే టిల్లు, అద్భుతం సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు ‘టిల్లు స్క్వేర్’ చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు.

డీజే టిల్లు అనేది వేరొకరు సృష్టించిన పాత్ర. పైగా దర్శకుడు కంటే కథానాయకుడికే ఎక్కువ పేరు వచ్చింది. మీరు సీక్వెల్ అంగీకరించే ముందు ఆ కోణంలో ఆలోచించారా?

అద్భుతం సినిమాకి కూడా కథ నాది కాదు. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథకు నేను దర్శకత్వం వహించాను. నరుడా డోనరుడా కూడా రీమేక్. నాకు ఆ కథ బాగా నచ్చి చేశాను. నేను కథలు రాయగలను.. అలాగే ఇతరులు రాసిన కథలను తెరకెక్కించి వాటికి న్యాయం చేయగలను. అలాగే సిద్ధుకి పేరు వస్తుందంటే నాకు ఆనందమే. ఎందుకంటే నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మేమంతా ఈ స్థాయికి రావడం కోసం దాదాపు 12 ఏళ్లుగా కష్టపడుతున్నాం. ఇప్పుడు కలిసి సినిమాలు చేస్తున్నాం. కాబట్టి ఎవరికి క్రెడిట్ వచ్చినా సంతోషమే.

సినిమాలో సిద్ధు ప్రమేయం ఎంతవరకు ఉంటుంది?

బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ఈ సినిమా కోసం సిద్ధుతో కలిసి రెండేళ్లు ట్రావెల్ చేశా. ఇద్దరం కలిసి సమన్వయంలో ఈ సినిమా చేశాం. డీజే టిల్లు నచ్చినవారిని టిల్లు స్క్వేర్ ఏమాత్రం నిరాశపరచదు.

టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతుంది?

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.

అనుపమ ఎంపిక ఎలా జరిగింది?

అనుపమ గొప్ప నటి. ఈ సినిమాలో లిల్లీ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేయగలదని నమ్మాము. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.

టిల్లు-3 వచ్చే అవకాశముందా?

కొన్ని ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్ లో వచ్చే అవకాశముంది.

రీ షూట్ కి వెళ్ళడానికి కారణం ఏంటి?

ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది.

విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కదా.. ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?

ఒత్తిడి ఉండటం సహజం. కానీ కథ బాగా రాసుకోవడంతో.. చిత్రీకరణ సమయంలో పెద్దగా ఒత్తిడి అనిపించలేదు. ఇక మొత్తం సినిమా చూసుకున్న తర్వాత ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది అనే నమ్మకం కలిగింది.

సంగీతం దర్శకులు మారడానికి కారణం?

ముందు నుంచి మేము డీజే టిల్లు టీంతోనే వెళ్ళాలి అనుకున్నాం. పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం థమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుతో పాట చేయించడం జరిగింది. థమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం.

సితార సంస్థ గురించి?

బడ్జెట్ గురించి ఎప్పుడూ మాట్లాడరు. కంటెంట్ గురించి , క్వాలిటీ గురించే ఎక్కువ మాట్లాడతారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. సితార బ్యానర్ లో పనిచేయడం సంతోషంగా ఉంది.

సినిమాలో ఏమైనా సందేశం ఉంటుందా?

కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు.

16 COMMENTS

సినిమా

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

రాజకీయం

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం – తుల రాశికి శుభవార్తలు

మార్చి 1, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహం పెరుగుతుంది. పనుల్లో వేగం పెంచాలనే ఆలోచన వస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం....

అడవిలో 10 కిలోమీటర్లు నడిచే పిల్లలకు రోడ్డు: అసలు విషయం ఇది!

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం...