మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట తప్పి, మడమ తిప్పడానికి గల కారణాలేంటో ప్రజలకు వివరించుకోవాలి.! ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు గాలికొదిలేసిందీ వివరించుకోగలగాలి.!
చెప్పుకుంటూ పోతే పెద్ద కథే.! పోలవరం ప్రాజెక్టు, సీపీఎస్ రద్దు, రాజధాని, కడప స్టీల్ ప్లాంట్.. లిస్టు మామూలుగా లేదు.! ఐదేళ్ళలో మాట తప్పుడు, మడ తిప్పుడు.. ఇదే తప్ప, మాట మీద నిలబడిందెక్కడ.!
చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే, ఏమీ చేతకాకపోతే, పక్కింటోడి పెళ్ళాం మీద పడి ఆడింగి ఏడుపులు ఏడ్చినట్లు తయారైంది పరిస్థితి. లేకపోతే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని మాట్లాడేందుకోసం వందల కోట్లు ఖర్చు చేసి, ‘బస్సు యాత్ర’ చేయాలా.?
రెండొందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు.. ఆ పైన ఖర్చు చేసి (ఒక్కొక్కరికీ), కూలీల్ని తీసుకురావడం వైఎస్ జగన్ బస్సు యాత్రలకే చెల్లింది. ఆ చెల్లింపుల దగ్గర తేడా వచ్చి, ఓ కుర్రాడు రాయి విసిరాడన్నది తాజాగా తేలిన అంశం. ‘రెండొందలిస్తామని తీసుకెళ్ళారు.. ఆ తర్వాతేమో, ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటూ కేసులు పెట్టారు..’ అంటూ బాధిత కుటుంబాలు రోడ్డెక్కాయ్.!
ఈ విషయం డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్ళుగా అదే చౌకబారు విమర్శలు కదా.. మళ్ళీ అవే ఎందుకు.? ఎందుకంటే, అక్కడ మేటర్ లేదు కాబట్టి.
!
డబ్బులిచ్చి జనాల్ని రప్పించుకుంటున్నా, మాట్లాడేది పూర్తిగా వినకుండానే జనమెందుకు జగన్ సభల నుంచి వెళ్ళిపోతున్నారంటే.. ఇదిగో, ఇలాంటి సిల్లీ ఏడుపులకే.!