Switch to English

జగన్‌పై అప్పట్లో రాళ్ళ వాన.! పవన్ కళ్యాణ్‌పై ఇప్పుడు పూల వాన.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్, గతంలో వరంగల్ జిల్లాకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూశాం. ఆయన ప్రయాణించిన రైలు మీద రాళ్ళతో దాడులకు దిగారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీకేయడం తెలిసిన విషయమే.

ఇక, ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది. బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వరంగల్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు.

జనసేన అధినేతకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున జనసేన, బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. దారి పొడుగునా పూల జల్లు కురిపించారు. ‘అప్పట్లో వైఎస్ జగన్ మీద రాళ్ళ వాన.. ఇప్పుడేమో జనసేనానికి పూల వాన..’ అంటూ నెటిజనం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఫొటోలు, వీడియోలతో సహా.

‘దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. కనీసం, బీసీ ముఖ్యమంత్రినైనా చూద్దాం. అలా జరగాలంటే బీజేపీ – జనసేన కూటమి గెలవాలి.. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించండి..’ అంటూ జనసేనాని, ఎన్నికల ప్రచార సభలో నినదించారు.

అధికార బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన ఓ నాయకుడు, కమిషన్ల గురించి మాట్లాడుతున్నాడంటే, ఉద్యమకారులు ఆకాంక్షించిన తెలంగాణ ఇది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నానో, తెలంగాణలోనూ ముందు ముందు అలాగే తిరుగుతాననీ, తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన ప్రజల తరఫున నినదిస్తుందనీ జనసేనాని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తెగువని తాను తెలంగాణ నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.

అసలు తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా.? పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా.? అంటూ రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారాలు చేస్తున్న దరిమిలా, జనసేనాని తెలంగాణ ఎన్నికల ప్రచారం.. అందరి నోళ్ళకూ తాళాలు వేసినట్లయ్యింది.

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...