టాలీవుడ్ సీనియర్ నటుడు, నటి పవిత్రా లోకేశ్ లో ఏడడుగులు వేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈరోజు నరేశ్ ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అగ్నిసాక్షిగా వీరిరువురూ పెళ్లాడినట్టు వీడియోలో ఉంది. ‘శాంతి, సంతోషంతో జీవితంలో కొత్త ప్రయాణానికి వేసుకుంటున్న బాటలు ఇవి. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు.. మీ పవిత్రానరేశ్’ అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే.. వీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా.. ఏదైనా సినిమా కోసం చిత్రీకరించిన సన్నివేశమా అనేది క్లారిటీ లేదు. కొన్నాళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. గతేడాది డిసెంబర్ 31న వీరు పోస్ట్ చేసిన వీడియో ఈ వార్తలకు బలం చేకూర్చింది. సమ్మోహనం చిత్రంలో వీరు కలిసి నటించారు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023