Ram Charan: అమెరికాలో ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 12న జరుగబోతున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో చిత్ర బృందంతో కలిసి పొల్గొననున్నారు. ఈక్రమంలో ఆయనను ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేశాయి. ప్రఖ్యాత టాక్ ఈజీ షోలో కూడా మాట్లాడారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేజే అబ్రమ్స్ ఓ ప్రైవేట్ పార్టీకి రామ్ చరణ్ ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసారు. ‘జేజే అబ్రమ్స్ ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. మీ పని తీరుకు నేను అభిమానిన’ని ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
స్టార్ ట్రెక్, స్టార్ వార్స్, మిషన్ ఇంపాజిబుల్-3 వంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన దర్శకుడు ఆయన. త్వరలో తన హాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఇటివల రామ్ చరణ్ చెప్పిన నేపథ్యంలో వీరిద్దరి కలయిక సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Had the privilege of meeting JJ Abrams today.
Thank you sir for inviting me this evening.
I’m a big fan of your work.@jjabrams pic.twitter.com/WTbnL2qjiC— Ram Charan (@AlwaysRamCharan) March 10, 2023