Dhootha : అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్ర లో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘దూత’ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతోంది. టీజర్ ను విడుదల చేసి కూడా చాలా కాలం అయింది. అయినా కూడా ఇప్పటి వరకు స్ట్రీమింగ్ చేయక పోవడం తో అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి తో ఉన్నారు.
అమెజాన్ వారు ఎందుకు నాగ చైతన్య తో రూపొందించిన దూత సిరీస్ ను స్ట్రీమింగ్ చేయడం లేదు. ఈ సిరీస్ కు ముందు చైతూ మరియు విక్రమ్ ల కాంబోలో థాంక్యూ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఈ సిరిస్ ను స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వారు వెనుకాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఎట్టకేలకు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా దూత యొక్క ట్రైలర్ ను విడుదల చేసి స్ట్రీమింగ్ తేదీని కూడా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి దూత ను అమెజాన్ లో అందుబాటులో ఉంచబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో ఇన్నాళ్లకు అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడ్డట్లు అయిందని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.
Meet Sagar and join him on a journey as he hunts for the truth 👀
Watch Now: https://t.co/DiRe3e1QD6 #DhoothaOnPrime, Dec 1 only on @PrimeVideoIN@parvatweets @priya_Bshankar @ItsPrachiDesai @Vikram_K_Kumar @nseplofficial @sharrath_marar @NambuShalini #NeelimaSMarar… pic.twitter.com/LXKSdrvWXE— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2023