టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమలో ఉన్నారనే విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొత్త సంవత్సరం సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెళ్లడించిన వీరిద్దరు తాజాగా పెళ్లి పీఠలు ఎక్కారు.
నరేష్ తన మాజీ భార్య రమ్య రఘుపతితో విడాకులు ఆలస్యం అవ్వడం వల్ల పెళ్లి ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవలే విడాకుల పక్రియ పూర్తి అవ్వడంతో ఆలస్యం చేయకుండా పవిత్రా లోకేష్ మెడలో నరేష్ తాళి కట్టాడు.
మా కొత్త ప్రయాణంలో జీవిత కాలం శాంతి మరియు ఆనందం కోసం మీ దీవెనలు కావాలి. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి ఫొటోను నరేష్ షేర్ చేశాడు.
గత కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్న నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడంతో సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కూడా లేటు వయసులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నరేష్ కు ఇది నాల్గవ వివాహం.