Switch to English

7 రోజులు.. 1700 కిలోమీటర్లు: కరోనా చేయించిన సాహసమిది

కన్నతల్లి కంటే జన్మభూమి గొప్పదంటారు. పొట్ట చేతబట్టుకుని ఎక్కడికెళ్లినా.. శేష జీవితం గడపడానికి మాత్రం సొంతూరికి వెళ్లిపోవడానికే ఎక్కువ మంది మక్కువ చూపిస్తుంటారు. జన్మభూమిపై ఉండే మమకారం అలాంటిది మరి. తాజాగా కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పలువురు సొంతూళ్లకు వెళ్లిపోవడానికే ప్రయత్నాలు చేశారు.

మొన్న ఢిల్లీలో.. నిన్న ముంబైలో వేలాది మంది వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పొడిగించడం.. ఎప్పటికి దీనికి ముగింపు పడుతుందో చెప్పలేకపోవడం ఒక కారణమైతే, లాక్ డౌన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకపోవడం మరో కారణం. అందుకే ఎక్కడో అష్టకష్టాలు పడేకంటే కలో గంజో తాగుతూ సొంతూళ్లేనే ఉందామనే భావనే వారితో అలా ఆందోళన చేయించింది. బతుకుతెరువు కోసం ముంబై వెళ్లిన ఓ ఒడిశా యువకుడు.. లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూరికి వెళ్లడానికి సాహసమే చేశాడు. ఏకంగా 1700 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.

ఒడిశాలోని బిచిత్రాపూర్ కు చెందిన మహేశ్ జెనా అనే యువకుడు ముంబై సాంగ్లిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో నెలకు రూ.15వేల వేతనానికి పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూసేశారు. మూడు నెలల వరకు తెరిచేది లేదని, అప్పటివరకు రావొద్దని యాజమన్యానం చెప్పేసింది. మూడు నెలలపాటు అక్కడ ఉండాలంటే ఇంటి అద్దె తదితరాలకు రూ.30 వేలు వెచ్చించాల్సిందే. కానీ మహేశ్ వద్ద మూడు వేలు మాత్రమే ఉన్నాయి. వారం రోజులపాటు అక్కడే ఉన్నాడు. ఇక అలా ఉండటం కష్టమని భావించాడు. ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో తన దగ్గరున్న సైకిల్ పై వెళ్లాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.

ఏప్రిల్ ఒకటో తేదీన ప్రయాణం ప్రారంభించాడు. ముంబై నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీదుగా ఒడిశా చేరాడు. నాలుగు రాష్ట్రాలు, ఏడు రోజులు, 1700 కిలోమీటర్లు ప్రయాణించాడు. రోజూ తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించడం.. మధ్యాహ్నానికి ఏ దాబా దగ్గరో ఆగడం.. మళ్లీ సాయంత్రం కాస్త ఎండ తగ్గగానే సైకిల్ తొక్కడం.. ఇదీ అతడి దినచర్య. మొత్తానికి ఏడు రోజుల తర్వాత ఊరికి చేరగా.. స్థానికులు అతడిని అడ్డుకున్నారు. పరీక్షల నిమిత్తం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు...

క్రైమ్ న్యూస్: కూలీ భార్యపై కాంట్రాక్టర్ రేప్ అటెంప్ట్.. ఆమె ఏం చేసిందంటే..

లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ...

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...