‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ – జనసేన కలవకుండా వైసీపీ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ ఈ కూటమిలోకి రాకుండా చేసేందుకు వైసీపీ నానా తంటాలూ పడింది.
ఇక, ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు, ఎన్ని సీట్లలో సరైన స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం.? అన్న దిశగా కూటమి నుంచి సీట్లను దక్కించుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ అంచనాకి ఓ ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు తగ్గినా, స్ట్రైక్ రేట్ విషయమై జనసేనాని చాలా పక్కాగా వున్నారు.
ఆయా అభ్యర్థుల ఎంపిక విషయమై జనసేనాని చాలా చాలా రీసెర్చ్ చేశారనే చెప్పాలి.! ఉదాహరణకి నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం మాధవికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చే క్రమంలో జనసేనానిపై చాలా ఒత్తిడి వచ్చింది. ఆమె గెలుస్తారా.? ఆ సీటు దండగ.. ఇలా చాలా చర్చ జరిగింది. టీడీపీ నుంచి చాలా చాలా ప్రశ్నలొచ్చాయ్.
కానీ, ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన బంపర్ విక్టరీ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం కావొచ్చు, ఇంకో నియోజకవర్గం కావొచ్చు.. ఎలా చూసినా, స్ట్రైక్ రేట్ విషయమై జనసేన, అంచనాల్ని అందుకునేలానే కనిపిస్తోంది.
లేటెస్ట్‌గా వెలుగు చూసిన సర్వేల ప్రకారం చూస్తే, జనసేన పార్టీకి 15 ప్లస్ అసెంబ్లీ సీట్లు దక్కే అవకావం వుందట. లోక్ సభ సీట్ల విషయంలో అయితే రెండు సీట్లకు రెండు సీట్లూ జనసేన ఖాతాలో పడబోతున్నాయని తేలింది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే.
నిజానికి, ఆట ఇప్పుడే మొదలైంది.! ఈ పాజిటివ్ వేవ్ ఇలాగే పోలింగ్ రోజు వరకూ కొనసాగించడం జనసేన పార్టీకి చాలా చాలా అవసరం. ఆ దిశగానే జనసేన పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.