CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే పవన్ కల్యాణ్ కు జై కొట్టడం సంచలనం రేపింది. కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం పర్యటనలో జరిగిందీ సన్నివేశం. వివరాల్లోకి వెళ్తే..
గండేపల్లి మండలంలోని సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులో ఆదిత్య యూనివర్శిటీ ఉంది. యూనివర్శిటీ మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుండటంతో యాజమాన్యం జగనన్న విద్యా దీవెనతో మేలు జరిగిన విద్యార్దులతో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అనే ఫ్లెక్సీలను వారి చేతబట్టి సిద్ధంగా ఉంచారు. దీంతో విద్యార్ధులను చూసిన సీఎం బస్సును ఆపారు. కళాశాల వైస్ చైర్మన్ తో మాట్లాడారు.
ఈక్రమంలో విద్యార్దులు.. ‘బాబులకే బాబు.. కల్యాణ్ బాబు’ అంటూ పవన్ కల్యాణ్ నామజపం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం జగన్ ఎదుటే జనసేన అధినేతకు జై కొట్టడం.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.