క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నా క్రీడా ఉత్సవం టాటా ఐపీఎల్ 2022 నేడు ప్రారంభం అయింది. ప్రారంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ రెండు హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లు గా మొదటి మ్యాచ్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేట్లుగా ఆడాయి. చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్ సర్ జడేజా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కూడా ధోని ఈ ఐపిఎల్ లో ఆడుతున్నాడు. ఆయన వయసు మీద పడింది.. ఏం ఆడుతాడు అన్నారు.
కీలక సమయంలో 50 పరుగులు చేసి చెన్నై పరువు నిలిపాడు. ధోని అద్భుత ఇన్నింగ్స్ ఆడినా కూడా చెన్నై గెలవలేక పోయింది. టోర్నమెంట్లో మొదటి మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను ఆరు వికెట్ల తేడా తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్ కి ఓటమి నిరుత్సాహాన్ని కాకుండా బలాన్ని పెంచుకునేలా చేస్తుంది. గతంలో కూడా ఇలా మొదట ఓడిపోయి ఆ తర్వాత ట్రోఫీ లు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడకుండా తదుపరి మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధోనీ ఇదే ఫామ్ తో కొనసాగితే ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ తమ వశం అవ్వడం ఖాయం అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.