వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ ఆయన చనిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి పదవి దక్కించుకోలేక పోయింది. అందుకు రాజకీయంగా చాలా కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచి కాంగ్రెస్ పార్టీకి ఆమె దూరం అయింది. కొండా సురేఖ తెలంగాణలో జగన్ పార్టీకి జీవం లేదనే విషయాన్ని గుర్తించి పార్టీ మారింది.
టిఆర్ఎస్ పార్టీ తో పాటు ఇతర పార్టీ ల్లో కూడా కొండ దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు వెళ్లారు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పార్టీ మారే యోచనలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉన్నాం.. రాజకీయ భవిష్యత్తు అంతా కూడా కాంగ్రెస్ లోనే ఉంటూ ఆమె తెలియ జేశారు. తమపై కావాలనే కొందరు కుట్రపూరితంగా పుకార్లు పుట్టిస్తున్నారు అని తాము కాంగ్రెస్ లోనే ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటాం అంటూ ప్రకటించింది.