Switch to English

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి.

మామూలుగా అయితే, ‘కాలుకి కాలు.. కన్నుకి కన్ను..’ అన్న చందాన, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ..’ అన్న చందాన.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించీ, వైఎస్ జగన్ సతీమణి భారతి గురించీ ఇలాగే మాట్లాడొచ్చు. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు.

‘నువ్వు సంస్కార హీనుడివి జగన్..’ అని గతంలోనే, పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు, ‘పెళ్ళిళ్ళు.. భార్యలు.. కార్లు..’ అంటూ జగన్ చేసిన విమర్శలపై. ‘ఏం, నేను నీ భార్య గురించి మాట్లాడలేకనా.? కానీ, మాకు సంస్కారం అడ్డొస్తుంది.. అందుకే, మేం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం..’ అని గతంలో పలు మార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అల్టిమేటం జారీ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

అయినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారలేదు. సమీప భవిష్యత్తులో మారతారనీ అనుకోలేం.! ‘కుక్క తోక వంకర.. అలాగే, జగన్ మోహన్ రెడ్డి బుద్ధి కూడా వంకర..’ అని జనసేన నేతలు, వైఎస్ జగన్ తీరుపై మండిపడుతున్నారు.

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై స్పందించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ‘ప్రజా జీవితంలో పెళ్ళాలు అనే మాట ఎలా వాడగలుగుతున్నావ్ జగన్.? నీకసలు సంస్కారం వుందా..’ అని నిలదీశారు.

‘నీలా నేను మాట్లాడటం ఎంత సేపు.?’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ, ఇలాంటి వార్నింగులు వైఎస్ జగన్ తలకెక్కవుగాక ఎక్కవు.! పవన్ కళ్యాణ్ నోరు జారితే పోయేది భారతి రెడ్డి పరువు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

తన జీవిత భాగస్వామిపై అట్నుంచి కౌంటర్ ఎటాక్ వస్తుందని తెలిసే, వైఎస్ జగన్ ఇంతలా తన రాజకీయ ప్రత్యర్థుల్ని రెచ్చగొడుతున్న వైనంపై వైఎస్ భారతి అప్రమత్తంగా వుండాలి. ఓ విజయమ్మ, ఓ షర్మిల.. ఓ భారతి.. రాజకీయానికొస్తే, వైఎస్ జగన్ ఎవర్నయినా ఒకేలా చూస్తారేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...