మాజీ ఐపీఎస్ లోక్ సత్త వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఉచిత హామీలపై.. సంక్షేమ పథకాలపై రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రస్తుతం పొరుగు దేశం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను భారత దేశంలోని రాష్ట్రాలు ఎదుర్కొనే రోజులు వచ్చే అవకాశం ఉందన్నాడు. ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు, నగదు పంపిణీ వంటి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలు కొన్ని సంవత్సరాలకు రాష్ట్రాలను శ్రీలంక మాదిరిగా చేస్తాయని ఆయన హెచ్చరించారు.
అవసరాన్ని మించి సంక్షేమ పథకాలను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా నష్టం చేకూరుతుందని.. అది సరైన అభివృద్ధి అవ్వదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో భారతదేశం ఈ పథకాల వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఒక టీవీ చానల్ చర్చలో జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు మేధావులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ మన పాలకులు మాత్రం పట్టించుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలను ప్రవేశపెడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.