Chandrababu: సంచలనం రేకెత్తించిన క్రికెటర్ హనుమ విహారీ (Hanuma Vihari) విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu), పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Lokesh) స్పందించారు. క్రికెట్లో వైసీపీ నేతల రాజకీయాలపై మండిపడ్డారు. ఆటల్లో రాజకీయ కక్షలకు, ప్రతీకారాలకు తెరలేపిన వైసీపీకి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు. అతడికి అండగా ఉంటామన్నారు.
లోకేశ్ స్పందిస్తూ.. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారిని ఏసీఏకు ఆడనని ప్రకటించే విధంగా చేశారు. అతడికి న్యాయం జరిగేలా చూస్తాం. విహారీ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. విహారీ చిత్తశుద్ధిని.. ఆటపై అతడి ప్రతిభను వైసీపీ రాజకీయాలు దెబ్బ తీయలేవు. రెండు నెలల్లో విహారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాం. ఏసీఏకి తిరిగి రావాలని ఆడాలని కోరుతున్నా’నని అన్నారు.
‘రంజీ మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడిపై అరిచాను. వ్యక్తిగతంగా నేనేమీ అనలేదు. కానీ.. రాజకీయ నేత అయిన తన తండ్రికి చెప్పి ఏసీఏపై ఒత్తిడి తీసుకొచ్చి.. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆత్మాభిమానం దెబ్బతిన్నచోట ఉండలే’నని విహారీ ఇన్ స్టా పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.