ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఒక వింత ఘటన అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. 70 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి 28 ఏళ్ల వయసున్న కోడలిని వివాహమాడాడు. ఈ విషయం అందరినీ షాక్ కు గురి చేసింది. గోరఖ్ పూర్ జిల్లాలో చపియా ఉమ్రావ్ గ్రామంలో నివసిస్తోన్న కైలాష్ యాదవ్ అనే వ్యక్తి తన మూడో కుమారుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు.
12 ఏళ్ల క్రితం కైలాష్ యాదవ్ భార్య చనిపోయారు. వీరికి నలుగురు సంతానం, వీరు అందరూ పెళ్లి చేసుకుని వేరు కాపురాలు పెట్టుకుని సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం కైలాష్ మూడో కుమారుడు చనిపోగా అతడి భార్య పూజ ఒంటరిగా ఉంటోంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు కైలాష్ స్థానికంగా ఉన్న గుడిలో పూజను వివాహం చేసుకున్నాడు. దేవుని సమక్షంలో పూజ నుదుట సింధూరం దిద్ది రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.