Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతూంటారు. అయితే.. బెంగళూరులో ఓ బాలుడిని ఏకంగా ఫుట్ రెస్ట్ పై నుంచోబెట్టి బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఓ బాలుడిని బైక్ ఫుట్ రెస్ట్ పై ప్రమాదకర రీతిలో నుంచోబెట్టి తీసుకెళ్తోంది ఓ జంట. బైక్ పై వెళ్తూండగా బాలుడిని మహిళ ఒక చేత్తో పట్టుకుంది. ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా ప్రమాదం జరిగే అవకాశముంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ తల్లిదండ్రులను శిక్షించాలి.. బెయిల్ కూడా ఇవ్వకుండా నెల రోజులు జైల్లో పెట్టాలి.. బెంగళూరు పోలీసులు దీనిపై చర్యలు చేపట్టాల’ని కామెంట్స్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Idiots on the road 🤬@blrcitytraffic @BlrCityPolice please take action. pic.twitter.com/tAN9BxTHiS
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) April 15, 2024