ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విష్ణుప్రియ తల్లి కాలం చేసారు. ఈ విషయాన్ని విష్ణుప్రియ స్వయంగా తెలిపింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ విషయాన్ని తెలిపింది.
“నా ప్రియమైన అమ్మ. ఈరోజు వరకూ నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకూ నీ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. ఇప్పుడు నువ్వు ఈ అనంతవిశ్వంలో భాగమైపోయావు కాబట్టి నా ప్రతీ శ్వాసలో నువ్వుంటావని విశ్వసిస్తున్నా. నీ జీవితంలో నాకోసం చేసిన ఎన్నో త్యాగాలకు, నాకు ఉత్తమమైన జీవితం అందించడానికి నువ్విచ్చిన ప్రేమకు ధన్యవాదాలు,” అని పోస్ట్ చేసింది విష్ణుప్రియ.
ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆమె ఫాలోయర్స్ కూడా ఈ న్యూస్ కు షాక్ అయ్యారు. విష్ణుప్రియ తల్లి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం.