‘కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.. మాస్కు పెట్టుకోండి’ అని తోటి ఉద్యోగితో చెప్పడమే ఆ ఉద్యోగిని తప్పైపోయింది. దీంతో రెచ్చిపోయిన ఉద్యోగి ఆమెపై దారుణంగా కత్తి, రాడ్ తో కార్యాలయంలోనే విచక్షణా రహితంగా తీవ్ర దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన నెల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కొన్నేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దాడి చేస్తూండగా అడ్డుకున్న తోటి ఉద్యోగులను సైతం ఆయన నెట్టేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు భాస్కర్ ను అరెస్టు చేశారు.
ఈ ఘటనపై సంబంధిత మంత్ర అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి, పోలీసులు కూడా వెంటనే స్పందించారని మహిళా ఉద్యోగి తెలిపారు. దీనిపై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగిన నేరాలను ఉపేక్షించేది లేదు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నెల్లూరు ఘటనలో మహిళ ఉద్యోగినిపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నెల్లూరు దిశ పీఎస్లో తదుపరి విచారణ కొనసాగుతుంద’ని తెలిపారు.
దారుణం:నెల్లూరు జిల్లాలోని @Tourism_AP డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగి ఉషపై ఇనుపరాడ్ తో దాడి..అసలు ఇంతలా దాడి చెయ్యడానికి కారణమెంటో తెలుసా..? మీరు ఎందుకు మాస్క్ పెట్టుకోలేదు అని అడగటమే
ప్రస్తుతం ఈ ప్రభుద్దుని పై కేసు నమోదు చేశారు పోలీసులు #COVIDIOTS pic.twitter.com/CakKa1QxEc
— TeluguBulletin.com (@TeluguBulletin) June 30, 2020
710085 115293But, what about the conclusion? Are you certain about the source? 662825
676458 655378For anybody who is interested in enviromentally friendly items, may possibly surprise for you the crooks to keep in mind that and earn under a holder simply because kind dissolved acquire various liters to crucial oil to make. daily deal livingsocial discount baltimore washington 13803