Switch to English

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ పేర్కొంటుందని, వైసీపీ అభిమానులు తెగ ఆశలు పెట్టేసుకున్నారు. నవరత్నాలు ప్లస్.. అంటూ జరిగిన ప్రచారం, అది ప్రకటితమవగానే తుస్సుమంది.!

అమ్మ ఒడి కింద లబ్దిదారులకు ఇచ్చే మొత్తాన్ని 15 వేల రూపాయల నుంచి 17 వేల రూపాయలకు పెంచడం, రైతులకు ఏటా ఇచ్చే 13,500 రూపాయల్ని 16 వేల 500 రూపాయలకు పెంచడం మినహా.. కొత్తగా ‘నవరత్నాలు ప్లస్’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో ఇంకే ఆసక్తికర అంశాలూ లేవు.

అమ్మ ఒడి విషయానికి వస్తే, కటింగులు పోను, లబ్దిదారుల చేతికి 12 నుంచి 13 వేల రూపాయలు మాత్రమే వెళుతున్నాయి. 17 వేలకు పెంచిన దరిమిలా, ‘కటింగ్’ ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. లబ్దిదారులకు పది వేలు అయినా వస్తుందా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయినా, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. సో, ఈ మేనిఫెస్టోని చెత్త బుట్టలో పడెయ్యడమే. అన్నట్టు, సామాజిక పెన్షన్లను క్రమంగా 3 వేల నుంచి 3500 రూపాయలకు పెంచుతారట. ఇది ఇంకో ఫన్నింగ్ అంశం మేనిఫెస్టోలో పొందు పరచబడింది.

తాము అధికారంలోకి వస్తే, సామాజిక పెన్షన్లను 4 వేలకు పెంచుతామనీ, అది ఈ ఏప్రిల్ నుంచే అమలయ్యేలా, అధికారంలోకి వచ్చాక.. ఈ మొత్తాన్ని కూడా కలిపి ఇస్తామని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దాంతో, వైసీపీ మేనిఫెస్టో మైనస్ లా మిగిలిపోయింది.

అసలంటూ వైసీపీ క్యాడర్‌‌లోనే ఈ మేనిఫెస్టోపై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ‘అబద్ధపు హామీలు ఇవ్వలేదు’ అంటూ కలరింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు కొందరు, ఈ అర్థం పర్థం లేని మేనిఫెస్టోని చూశాక కూడా.

ఆసక్తికరమైన విషయమేంటంటే, గులక రాయి దెబ్బ తర్వాత, ఇన్ని రోజులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నుదుటన వున్న బ్యాండేజీని తొలగించారు. పెద్ద పెద్ద సర్జరీలు జరిగితేనే, రెండు మూడ్రోజులకి బ్యాండేజీ తొలగిస్తుంటారు. అలాంటిది, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చాలా రోజులపాటు చిన్న బ్యాండేజీని అలాగే వుంచుతూ వచ్చారు.

‘అది తొలగించకపోతే చీము పడుతుంది..’ అని సోదరి డాక్టర్ సునీతా రెడ్డి చేసిన సూచనతో, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాస్త భయం వేసి, బ్యాండ్ ఎయిడ్ తొలగించారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

కాగా, ‘అబద్ధపు హామీలు ఇవ్వం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారుగానీ, గత మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం, సీపీఎస్ రద్దు వంటి అంశాలు వైసీపీ పాలనలో కార్యరూపం దాల్చలేదు. పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదు. ప్రత్యేక హోదా కూడా సాధించలేకపోయింది వైసీపీ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....