Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.

సర్వేల్లో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినాగానీ, నారా లోకేష్ నిజంగానే రిస్క్ చేసి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. చాలా తక్కువ ఓట్లతో.. అంటే, కేవలం 5 వేల ఓట్లతోనే నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారిక్కడ. 2014 ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు.

రాజధాని అమరావతి పరిధిలో వుంటుంది మంగళగిరి నియోజకవర్గం. భూ సమీకరణ విషయమై రైతులు కొంత అసహనంతో వుండడం సహా అనేక కారణాలు వైసీపీకి అప్పట్లో ఈ నియోజకవర్గంలో కలిసొచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. కుల సమీకరణాల్లాంటివి ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడటం, మంగళగిరిలో ఈ కూటమికి అడ్వాంటేజ్. పైగా, నారా లోకేష్ చాలా చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి, గ్రౌండ్ లెవల్‌‌లో బాగానే వర్క్ చేశారు. ఐదేళ్ళుగా రాజధాని అమరావతిని రాచి రంపాన పెడుతున్న వైసీపీ పట్ల విపరీతమైన నెగెటివిటీ ఈ నియోజకవర్గంలో వుంది. అదే నారా లోకేష్‌కి కలిసొస్తోంది.

‘మంగళగిరిలో నారా లోకేష్ గెలుపుపై ఎలాంటి అనుమానాల్లేవ్. మెజార్టీ గురించిన చర్చే ఇక్కడ..’ అని వైసీపీ అంతర్గత సర్వేల్లోనే తేలింది. అందుకే, టీడీపీ నుంచి పలువురు నేతల్ని వైసీపీలోకి లాగేయడంలో వైసీపీ అధినాయకత్వం ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యాయి కూడా.

పలుమార్లు మంగళగిరి అభ్యర్థుల్ని మార్చిన వైసీపీ, చివరికి మురుగుడు లావణ్యను రంగంలోకి దించింది. మహిళా అభ్యర్థి.. అన్న అంశమైనా కలిసొస్తుందన్నది వైసీపీ ఉద్దేశ్యం కావొచ్చు. కానీ, ఆ ఫ్యాక్టర్ కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడలేదు.

చేనేత కార్మికుల ఓట్లు, దళిత ఓటు బ్యాంకు.. ఇలా లెక్కలేసుకునే అవసరమే లేకుండా నారా లోకేష్, చాలా తేలిగ్గా మంగళగిరి నియోజకవర్గంలో గెలవబోతున్నారన్నది దాదాపు అన్ని సర్వేలూ చెబుతున్న అంశం. ‘కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు.. మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారు..’ అని కొన్నాళ్ళ క్రితం లోకేష్ గెలుపు గురించి వైసీపీ నాయకులే కామెంట్ చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

అన్నట్టు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొన్నాళ్ళ క్రితం వైసీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి, కొన్ని రోజుల తర్వాత తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆయనే తిరిగి పోటీ చేసినా, మంగళగిరిలో నారా లోకేష్‌కి కొంత పోటీ వుండేది. ఇప్పుడైతే, లోకేష్ ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేసిన వైనం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...