ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం వుందండోయ్.!
రాయలసీమ స్లాంగ్లో.. అందునా, కడప స్లాంగ్లో సదరు వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథి చేస్తున్న వీడియోలు, జనాన్ని ఆలోచింపజేస్తున్నాయ్. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎలా వుందో జనానికి స్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియోల కారణంగా.
ఇప్పటికే చాలా వీడియోలు చేసేసి వదిలాడు.. ఇకపైనా వదులుతాడు. మామూలుగా అయితే, అరెస్టు చేసేసి లోపలేయించెయ్యాలి.. కానీ, ఎన్నికల కోడ్ వచ్చేసింది కదా.. కుదరడంలేదమో వైసీపీకి.! ‘రంకుమొగుడు’ అన్నది చిన్నమాట.. అంతలా వైసీపీని సదరు అంతర్జాతీయ ప్రతినిథి ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.
రాజకీయాల్లో ఈ తరహా సెటైరికల్ వీడియోలు మామూలే అయినా, వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథి వ్యవహారం మాత్రం సమ్థింగ్ స్పెషల్ అంతే.
తాజా వీడియోలో, రాష్ట్రానికి మూడు రాజధానులనే కాన్సెప్ట్ తాలూకు గుట్టు విప్పేశాడు ఆ వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథి. ఒకటేమో డ్రగ్స్ రాజధాని అట. ఇంకోటేమో గంజాయి రాజధాని అట. మూడోదేమో గంజాయి రాజధాని అట.! సరిపోయాయిగా మూడు రాజధానులు.. అంటూ సెటైర్ వేశాడు సదరు వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథి.
నిజమే కదా.! మూడు రాజధానుల లెక్క సరిపోయింది కదా.? అని జనం చర్చించుకుంటున్నారు. నిజానికి, ఇవే తరహా రాజధానులంటే చాలా వున్నాయ్.! కోడి కత్తి రాజధాని వుండాలి.. గొడ్డలి వేటు – గుండె పోటు రాజధాని ఒకటుండాలి.. జిల్లాకో రాజధాని సరిపోదు.. గ్రామానికో రాజధాని పెట్టుకోవాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా బూతుల రాజధాని కూడా వుండి తీరాలి.! ఎందుకంటే, వైసీపీ హయాంలో బూతులనేవి అధికార భాషగా మారిపోలా.?