రామ్ చరణ్ హీరోగా తమిళ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నా కూడా దిల్ రాజు శైలి చాలా ప్రత్యేకం, ఆయన సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
అలాంటి దిల్ రాజు, శంకర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు తో ఎలా సినిమాలు చేస్తున్నాడు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పాటకే ఐదు నుండి 10 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసే శంకర్ తో దిల్ రాజు ఎలా నెట్టుకొస్తున్నాడు అనేది కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఈ సమయంలోనే శంకర్ ని బడ్జెట్ విషయంలో దిల్ రాజు వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రారంభం సమయంలోనే దర్శకుడు శంకర్ మరియు నిర్మాత దిల్ రాజు మధ్య బడ్జెట్ ఒప్పందం జరిగిందట.
ఆ ఒప్పందం ప్రకారం బడ్జెట్ పరిమితి దాటితే దర్శకుడు శంకర్ రెమ్యూనరేషన్ విషయంలో కటింగ్స్ ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారట. అందుకే శంకర్ అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.