పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం
సూర్యోదయం: ఉ.6:20
సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు
తిథి: కార్తీక బహుళ అష్టమి రా.10:40 ని.వరకు తదుపరి కార్తీక బహుళ నవమి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: పుబ్బ రా.2:37 ని.వరకు తదుపరి ఉత్తర
యోగం: విష్కంభం రా.10:34 ని. వరకు తదుపరి ప్రీతి
కరణం: భాలవ ఉ.9:35 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం : ఉ.8:32 నుండి 9:16 ని. వరకు తదుపరి రా.10:32 నుండి 11:24 వరకు
వర్జ్యం : ఉ.8:49 నుండి 10:36 వరకు
రాహుకాలం: మ.3:00 ని. నుండి సా.4:30 గం.వరకు
యమగండం: ఉ.9:00 గం. నుండి 10:30 ని .వరకు
గుళికా కాలం: మ.12:06 ని నుండి 1:29 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:59 ని.నుండి 5:47 ని.వరకు
అమృతఘడియలు: రా.7:29 ని.నుండి 9:16 ని వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:44 నుండి మ.12:28 వరకు
ఈరోజు (05-12-2023) రాశి ఫలితాలు
మేషం: వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.
వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.
మిథునం: ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
కర్కాటకం: వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.
సింహం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి.
కన్య: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబసభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి.
వృశ్చికం: మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు: చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.
మకరం: ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
మీనం: వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతబత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.