Cyclone Michaung: మిగ్ జాం తుపాను (Cyclone Michaung) ప్రస్తుతం తన దిశ మార్చుకుని కోస్తాంధ్ర తీరం వెంబడి కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం (Machilipatnam) -నిజాంపట్నం (Nijampatnam) మధ్యతో ‘మిగ్ జాం’ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం గంటకు 10కి.మీ వేగంతో తుపాను కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతాపం చూపిస్తోంది. తుపాను తీవ్రతకు చెన్నై (Chennai) అతలాకుతలమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వీధుల్లోకి వస్తున్న వరదనీటి ధాటికి పలు కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
చెన్నై ఎయిర్ పోర్టులోని రన్ వే పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకూ 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు నగరంలోని కనతూరు ప్రాంతంలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. పాఠశాలలకు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Understand this is Chennai airport today.
The sea seems to have taken it over.
And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez
— Tarun Shukla (@shukla_tarun) December 4, 2023