Switch to English

గొడుగులతో కరోనాకు చెక్?

ప్రాణాంతక కరోనా మహమ్మారిని గొడుగులతో అడ్డుకోవచ్చా? అసలు మందే లేదని ప్రపంచం గగ్గోలు పెడుతున్న తరుణంలో గొడుగుతో ఈ వైరస్ ను ఎలా అడ్డుకుంటాం అని అనుకుంటున్నారా? నిజమే ప్రస్తుతానికి కరోనాకు మందు లేదు.. వాక్సినూ లేదు. ఇది సోకకుండా చూసుకోవడమే ఏకైక మార్గం. అందుకు భౌతికదూరం పాటించడం తప్ప మరో ఆప్షన్ లేదు.

స్వీయ గృహనిర్బంధం పాటించడం, ఒకవేళ బయటకు వస్తే భౌతికదూరం ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం నిత్యావసరాల కొనుగోలులో గానీ, బ్యాంకులకు వచ్చినప్పుడు గానీ చాలామంది సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. కొన్నిచోట్ల ఎంతదూరంలో ఉండాలో మార్కింగ్ గీస్తున్నారు. కానీ అన్నిచోట్లా ఇది కుదరడంలేదు.

ముఖ్యంగా జన్ ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం వేసిన రూ.500 నగదు తీసుకోవడానికి గురువారం పెద్ద సంఖ్యలో మహిళలు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఎక్కడా భౌతికదూరం పాటించలేదు. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ‘అంబరిల్లా ప్రిన్సిపల్‘ అక్కరకొస్తుందని విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు చెబుతున్నారు.

బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ గొడుగు వేసుకుంటే, ఆటోమేటిగ్గా మనిషికీ మనిషికీ మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉంటుందని.. తద్వారా భౌతికదూరం పాటించినట్టేనని పేర్కొంటున్నారు. భౌతికదూరం పాటించడం ద్వారా 75 శాతం మేర కరోనాను నియంత్రించవచ్చనే సంగతి అధ్యయనాల్లో తేలిందని.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇంతకు మించిన ఔషధం లేదని చెప్పారు.

కరోనా కనీసం ఏడాది పాటు ఉండే అవకాశం కనిపిస్తోందని.. ఈ నేపథ్యంలో ఈ గొడుగు చిట్కా తప్పకుండా పనిచేస్తుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎండలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ గొడుగు వేసుకుంటే అటు ఎండ నుంచి, ఇటు కరోనా నుంచి కూడా రక్షణ పొందొచ్చని స్పష్టంచేస్తున్నారు. ఈ చిట్కా వర్కవుట్ అయ్యేలాగే కనిపిస్తోంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

బాలయ్య – బోయపాటి.. ఓ సస్పెన్స్ డ్రామా

నందమూరి బాలకృష్ణ - సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనులది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ మొదట కలిసి చేసిన సింహా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఇద్దరూ...

మహాసముద్రంను ఈదేది వాళ్లిద్దరేనా?

ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసి మరో రెండు మూడు...