Switch to English

జగన్‌ సర్కార్‌కి మరో మొట్టికాయ.. అలవాటైపోయిందంతే.!

మొట్టికాయ.. మళ్ళీ మళ్ళీ మొట్టికాయ.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి పదే పదే న్యాయస్థానాల్లో మొట్టికాయలు ఎదురవుతున్నాయి. అయినాసరే, తమ విధానపరమైన వైఫల్యాల్ని సమీక్షించుకోవడం మానేసి, విపక్షాల మీద, మేధావుల మీద విరుచుకుపడిపోవడం జగన్‌ సర్కార్‌ మానుకోవడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేయడం దగ్గర్నుంచి, చాలా విషయాల్లో న్యాయస్థానాలు వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మొట్టికాయలు వేస్తూనే వున్నాయి.

తాజాగా, ఇంగ్లీషు మీడియం విషయమై జగన్‌ సర్కార్‌కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలుగు మీడియంని పూర్తిగా ఎత్తివేస్తూ, మొత్తంగా ఇంగ్లీషు మీడియంని ప్రభుత్వ స్కూళ్ళలో తప్పనిసరి చేయడానికి ఉపక్రమించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఈ మేరకు రెండు జీవోల్ని కూడా విడుదల చేసింది. ఆ జీవోలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. విచారణ పూర్తయ్యాక తీర్పుని న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని న్యాయస్థానం కొట్టివేసింది.

నిజానికి, ఇంగ్లీషు మీడియంని ఎవరూ వ్యతిరేకించడంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీషు మీడియం అవసరమే. ఆ ఇంగ్లీషు మీడియం పట్ల జనంలో అవగాహన పెరిగింది. ప్రభుత్వాలకే అవగాహన పెరగాల్సి వుంది. ఇంగ్లీషు మీడియంని జనంలోకి తీసుకెళ్ళడమంటే, తెలుగు మీడియంని రద్దు చేయడం కాదు.! ఈ చిన్న లాజిక్‌ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ గుర్తించలేకపోయింది. అదే అసలు సమస్య.

విపక్షాలు విమర్శించినా, భాషా పండితులు ఆందోళన వ్యక్తం చేసినా.. తెలుగు నేలపై తెలుగు మీడియం లేకపోతే ఎలా.? అన్న ఉద్దేశ్యంతోనే తప్ప, ఇంగ్లీషు భాషని వ్యతిరేకించాలని కాదు.. ఇంగ్లీషు మీడియంకి వ్యతిరేకంగానూ కాదు. ఇంగ్లీషు మీడియం ఇప్పుడు ఒక అవసరం. దానికి ఎంత ప్రాధాన్యతనిచ్చినా తప్పేమీ లేదు. తెలుగు మీడియంని నిర్లక్ష్యం చేయడమే ఇక్కడ బాధిస్తోన్న విషయం.

అన్నట్టు, పరిస్థితుల్ని ముందే ఊహించిన జగన్‌ సర్కార్‌, మండలానికి ఓ స్కూల్‌లో తెలుగు మీడియం కొనసాగించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఏదిఏమైనా, సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడంలేదో ఏమోగానీ.. జగన్‌ సర్కార్‌కి మాత్రం పదే పదే మొట్టికాయలు తప్పడంలేదాయె. లోపం సలహాదారుల్లోనే వుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒకటికి పదిసార్లు ‘రూల్‌ ఔట్‌’ చేసుకుంటే మంచిదేమో.!

సినిమా

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు గాయాలు.!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య తన హోం జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

మహేష్ అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూసారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా పనులేం జరగలేదు కాబట్టి ఆర్ ఆర్...

ఎన్టీఆర్‌కు అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా అద్బుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో తిరుగులేని రికార్డును ఎన్టీఆర్‌కు కట్టబెట్టి నందమూరి ఫ్యాన్స్‌ సత్తా చాటారు. నేడు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన...