Switch to English

బిగ్‌ షాక్‌: ఏపీలో ఈ రోజు సెంచరీ కొట్టిన కరోనా.!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. మొత్తంగా 102 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్యను 57గా చూపిస్తోంది. అదే సమయంలో, ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 45 అని విడిగా పేర్కొంటుండడం గమనార్హం. నిన్నటినుంచే ఈ విధానం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి రాకపోకలు ప్రారంభమయిన దరిమిలా, ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాలు ‘మైగ్రెంట్స్‌’ పేరుతో ప్రత్యేకంగా కేసుల వివరాల్ని ప్రకటిస్తున్నా, వాటి వివరాల్ని మొత్తం కేసులతో కలిపే చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇదిలా వుంటే, తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ తాలూకు ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కేసుల్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా, ఏపీ కేటగిరీలోనే వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ.

రాష్ట్రానికి సంబంధించి మొత్తం లెక్కలో ‘మైగ్రెంట్స్‌’ని పేర్కొనకపోతే, ఆ కేసులు దేశానికి చెందిన మొత్తం లెక్కలో కలుస్తాయా.? లేదా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇదే నిర్ణయం తీసుకుంటే.. లెక్కలు పూర్తిగా తప్పేస్తాయి. తెలంగాణలోనూ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ లేని విధానం ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు ఫాలో అవుతోందో ఏమో.. అధికార యంత్రాంగం వివరణ ఇవ్వాల్సి వుంది. ఇక, ఈ రోజు రాష్ట్రం చెబుతున్నదాన్నిబట్టి 57 కేసులు నమోదవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. కేసుల సంఖ్య మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నట్లే భావించాలేమో.

కర్నూలు జిల్లాలో నిన్న కొత్త కేసులు నమోదు కాకపోగా, ఈ రోజు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ కొత్త కేసులు (3) నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మాత్రం కొత్త కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. విశాఖపట్నంలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. కోయంబేడు ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదిఏమైనా, మైగ్రెంట్స్‌ని కలుపుకుని రాష్ట్రంలో ఈ రోజు 102 కేసులు నమోదు కాగా.. కరోనా వైరస్‌కి సంబంధించి రాష్ట్రంలో ఒకే రోజు నమోదైన అతి ఎక్కువ కేసులు ఇవే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...