Switch to English

16 సంవత్సరాలుగా కానిది., జగన్ 16 నెలల్లో పూర్తి చేస్తాడట.!

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాటలు పక్కన పెట్టి చేతల్లో చేసి చూపిస్తున్నారు.  ఇప్పటి వరకు జగన్ అన్నింటిని కూడా పధకాల రూపంలోనే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు.  ఇవన్నీ సంక్షేమ పధకాలు కాబట్టి ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగం లేదు.  ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వైకాపాపై ఉన్నది.
గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగా హామీలు ఇచ్సి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టె రకం కాదు జగన్ అని ఇప్పటికే ప్రజలకు అర్ధం అయ్యింది. పనులు చకచకా జరుగుతుండటంతో జగన్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.  అయితే, ఇక్కకే ఓ చిక్కు ప్రశ్న ఉన్నది.  ఇవన్నీ సంక్షేమ పధకాలు… కానీ, అసలు పూర్తి చేయాల్సినవి చాలా ఉన్నాయి.  సంక్షేమ పధకాల వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అంటే చెందదు.  అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి.  ఎలా చేస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది.
ఏ రాష్ట్రమైన సుభిక్షంగా ఉండాలి అంటే నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి.  నీరు ఉంటేనే పంటలు పండుతాయి.  అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత నీటిపారుదల వ్యవస్థపై దృష్టి పెట్టారు.  సంక్షేమ పథకాలకు రెండో స్థానం ఇచ్చారు.  అందుకే చాలా స్పీడ్ గా చెరువుల పూడిక, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించుకున్నారు.  ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో నడవబోతున్నారు.  16 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్లోనే ఉన్నది.  ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలి.  కానీ, గత ప్రభుత్వం తాము ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పింది.
హామీని నిలబెట్టుకోలేకపోయింది.  ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.  పోలవరం ప్రాజెక్టును జగన్ పరిశీలించి 16 నెలల్లోనే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.  వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాలని, అద్భుతంగా ప్రాజెక్టును ఓపెన్ చేయాలనీ చెప్పారు.  అంతా బాగుంది.  నిధులే లేవు.  కానీ, జగన్ నిధుల విషయంలో కూడా అధికారులకు హామీ ఇచ్చారు.  జగన్ హామీ ఇచ్చారు అంటే చేసి తీరుతారని అందరికి తెలుసు.  సో, వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని పోలవరం ఓపెన్ చేస్తే, జగన్ కు రాష్ట్రంలో తిరుగుండదు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

క్రైమ్ న్యూస్: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అఘాయిత్యం

ప్రేమ పేరుతో షాద్‌ నగర్‌కు చెందిన భాను యువతిపై దారుణంకు పాల్పడ్డారు. స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న యువతిని భాను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఇటీవల ఆమెను ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ...

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు...

బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు ఈ రోజు సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మీ నారాయణ చిన్న కుమారుడు ఫణేంద్ర...