Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: వైసీపీలో ఆ చిల్లరగాళ్ళవరంటే.!

రాజకీయాల్లో ప్రత్యర్థులపై ‘చిల్లరగాళ్ళు’ అని విమర్శలు చేయడం సహజమే. కానీ, వైసీపీ నేతలే తమలో తాము ‘చిల్లరగాళ్ళు’ అని తిట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవి పోతుందనో ఫ్రస్ట్రేషన్‌ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన ఇక్బాల్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. హిందూపురంలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఇక్బాల్‌, సొంత పార్టీ నేతలపైనే ‘చిల్లరగాళ్ళు’ అంటూ నోరు పారేసుకున్నారు.

ఇటీవలి ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన ఇక్బాల్‌, టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం విదితమే. అయితే, తన ఓటమికి సొంత పార్టీ కార్యకర్తలే కారణమంటూ ఇక్బాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలంగా. మరోపక్క, ఇక్బాల్‌కి వ్యతిరేకంగా మరో గ్రూపు హిందూపురం నియోజకవర్గ వైసీపీలో షురూ అయ్యింది. ఈ గ్రూప్‌పై ఎప్పటికప్పుడు ఇక్బాల్‌, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే వున్నా, అధిష్టానం నుంచి మాత్రం ఇక్బాల్‌కి తగిన స్థాయిలో మద్దతు లభించడంలేదు. ఆ అసహనాన్ని తాజాగా ఇక్బాల్‌ వెల్లడించారు.

‘గతంలో వైఎస్‌ జగన్‌నీ, షర్మిలనీ బూతులు తిట్టినోళ్ళు.. చిల్లరగాళ్ళు ఇప్పుడు పార్టీని భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నారు..’ అంటూ వాపోయారాయన. ఇక్బాల్‌ ఒక్కరే కాదు, పార్టీలో ‘చిల్లరగాళ్ళపై’ చాలామంది వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో అసహనంతో ఊగిపోతున్నారు. ఆ లిస్ట్‌లో నెల్లూరు జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా ఒకరు. ఈ ఇద్దరే కాదు, ఇంకా ఇలాంటోళ్ళు చాలామందే వున్నారట.

సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌పైనా.. ఈ తరహా ఆరోపణలు గత కొంతకాలంగా విన్పిస్తుండడం గమనార్హం. ‘మండలి రద్దుకి ముందు పరిస్థితి ఇలా వుంది. మండలి నిజంగానే రద్దయితే.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేయడం ఖాయం..’ అని వైసీపీ వర్గాల నుంచే మీడియాకి లీకులు అందుతున్నాయి. కాగా, రాజోలు నియోజకవర్గంలోనూ పార్టీ రెండుగా విడిపోయింది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మొత్తమ్మీద, వైసీపీలో ‘చిల్లరగాళ్ళ’ వ్యవహారం, పార్టీ పుట్టి ముంచేలా వుందన్నమాట.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...