సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు.
సముద్ర మూవీస్ బ్యానర్ లో సముద్ర దర్శకుడిగా ‘రామ జన్మభూమి’ అనే టైటిల్ తో సినిమా రూపొందుతోంది. యువత రాజకీయాల్లోకి రావాలి అనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
టీజర్ కి మంచి స్పందన వచ్చింది. రవి శంకర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. జై సిద్ధార్ద్, శ్రీ రాధా ,నాసర్, సుమన్, అజయ్ గోష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ విడుదలకు సీనియర్ నటుడు మురళి మోహన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హాజరు అయ్యారు.
ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ఒక దేశానికి రాజుగా ఒక తండ్రిగా మంచి బిడ్డగా ధర్మ బద్దంగా బతికి చూపించిన రాముడు మన అందరికి ఆదర్శం. అందుకే ఆ స్ఫూర్తితోనే యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని రూపొందించినట్లుగా దర్శకుడు సముద్ర రావు అన్నారు. సినిమా కు మురళి మోహన్ మరియు మాధవి లత శుభాకాంక్షలు తెలియజేశారు.