Switch to English

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ- కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ బరిలో దిగుతుండగా.. మరో వైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరి తన అన్నపై పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో శింగనమల నియోజకవర్గం వైపు అందరి దృష్టి పడింది. అందుకు కారణాలేంటంటే..

మరో మూడు రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల్లో బరిలో నిలుచున్న పార్టీల నేతలంతా భారీ బహిరంగ సభలు, ప్రచారాలతో.. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నారు. కాగా ఎన్నడూ లేనంతగా ఈసారి ఏపీ ఎన్నికలు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

గత కొంతకాలం వరకూ రాష్ట్రంలో వైసీపీ- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి తప్ప కాంగ్రెస్ నాయకుల పోటీపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడైతే వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారో అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన అన్న జగన్‌ను లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పించడం.. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం పాటుపడటం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నట్లుగా మారింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి శైలజానాథ్ పోటీ చేయడం. దీంతో అక్కడ ప్రధాన పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారి ఉత్కంఠను కలిగిస్తోంది.

కాగా 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు- వైసీపీ మధ్య గట్టి పోటీ కొనసాగుతుండగా శింగనమలలో మాత్రం కథ వేరేలా ఉంది.ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు ఎక్కువగా కనిపించడంతో గెలుపోటములపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

కాగా ఉమ్మడి రాష్ట్రంలో శింగనమల నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సాకే శైలజానాథ్ పనిచేశారు. అయితే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ సీటు దక్కించుకోలేకపోయింది. రెండు సార్లూ ఓటమి పాలయ్యింది. ఆ జాబితాలో మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఉన్నారు.

ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన శైలజానాథ్.. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గం కోసం పనిచేశారు. కాగా తనను పార్టీలోకిి రమ్మని వైసీపీ, టీడీపీ నేతలు ఆహ్వానించినా ఆయన తిరస్కరించి కాంగ్రెస్ కోసమే పనిచేశారు. అయితే ఈ పదేళ్లుగా శింగనమల నియోజకవర్గంలో ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారం చేజిక్కించుకున్నాయి.

దీంతో ఈ సారి కూడా ఈ నియోజకవర్గంలో జెెండా ఎగురవేసేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ పదేళ్లలో శింగనమల నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతో.. దీనిని శైలజానాథ్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్థానిక సమస్యలను గత ఎమ్మెల్యేలు పరిష్కరించకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. శైలజానాథ్ ప్రచారాలు చేస్తున్నారు. ఈసారి తనను గెలిపిస్తే నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు.

ఈ క్రమంలో గతంలోని ఓట్ బ్యాంక్‌ను తిరిగి తనవైపునకు తిప్పుకునేందుకు శైలజానాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఆయనకు కొన్ని సంఘటనలు కూడా కలిసి వస్తున్నాయి. స్థానికంగా వైసీపీ నేతల్లో, టీడీపీ నేతల్లో సమన్వయం కూడా కొరవడటం కూడా ఓ కారణం. దీనిని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. దీంతో సర్వేల ఫలితాలు కూడా శింగనమల కాంగ్రెస్ వైపే అన్నట్లుగా ఉన్నాయి.

ఇక పోలింగ్ దగ్గరపడుతుండటంతో శైలజానాథ్.. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తున్నారు. స్థానిక నాయకుల మద్దతు కూడా కోరుతూ.. ఇతర సీనియర్ నేతలతో కూడా కో ఆర్డినేషన్ కోసం యత్నిస్తున్నారు. దీంతో ఈ సారి శింగనమలలో గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్‌దే అని ప్రచారం గట్టిగా సాగుతోంది. ఫలితంగా నియోజకవర్గ ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...