Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు విష్ణు ఈసారి కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు అంటూ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది ఈ భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. కన్నప్ప సినిమా లో ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నాడు, ఎలాంటి పాత్రను ఆయన చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2, కల్కి తో పాటు రాజాసాబ్ సినిమాలను చేస్తున్నాడు. ఇవి కాకుండా స్పిరిట్ మరియు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇంతటి బిజీగా ఉన్న ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ప్రభాస్ కోసం కన్నప్ప రిలీజ్ ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు.