Satya : హమరేష్, ప్రార్థన జంటగా వాలి మోహన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘రంగోలి’ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో ‘సత్య’ గా శివం మీడియా ద్వారా శివ మల్లాల తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్య మూవీ గురించి నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ… చెన్నై వెళ్లిన సమయంలో నా స్నేహితుడు సతీష్ ఈ సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేయించి చూపించారు. సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను.
ఈ సినిమా డబ్బింగ్ కోసం కాంప్రమైజ్ కాకుండా 12 లక్షలు ఖర్చు చేశాను. ఒక అచ్చమైన తెలుగు సినిమా మాదిరిగా ఇది వచ్చింది. ఒక డబ్బింగ్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగకుండా ప్రేక్షకులకు తెలుగు సినిమా చూస్తున్నాము అనే భావన కలిగే విధంగా డబ్బింగ్ చేశాము అన్నారు.
తమిళ వర్షన్ మరియు తెలుగు వర్షన్ లకు క్లైమాక్స్ వేరు వేరుగా ఉండటం అదృష్టం. రెండు వర్షన్‌లకు కూడా క్లైమాక్స్ దర్శకుడు ముందే వేరు వేరుగా చిత్రీకరించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండే విధంగా క్లైమాక్స్ ఉంటుంది. తప్పకుండా మా సత్య ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని మెప్పిస్తుందని నిర్మాత శివ మల్లాల చెప్పుకొచ్చాడు.