Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్య’ (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) విడుదల చేశారు. కాజల్ మాట్లాడుతూ.. ‘మంచి ఫీల్ ఉన్న పాట విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. నిర్మాత శివ మల్లాల నాకెప్పటి నుంచో పరిచయం. వృత్తిరీత్యా మంచి అనుబంధం ఉంది. సినిమా విజయం సాధించాల’ని ఆకాంక్షించారు.
నిర్మాత శివ మల్లాల.. ‘కాజల్ నాకు లక్ష్మి కళ్యాణం సినిమా నుంచి పరిచయం. “స్పెషల్ చబ్బీస్” సినిమాకు నేను పీఆర్వో. నన్ను అక్షయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. నేను నిర్మాతగా చేస్తున్న తొలి సినిమాకి కాజల్ గారు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదా’లని అన్నారు.
సత్య సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటకి విశేష ఆధరణ లభించింది. 90వ దశకంలో పుట్టిన వారికి ఈ పాట కనెక్ట్ అవుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. కేఎస్ సంగీతంలో పాట ఆకట్టుకుంటుందని అంటున్నారు.