మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు ముంబైలా మారిపోతాయ్.!
ఇదేమీ ట్రోల్ కంటెంట్ కాదు.! ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వ్యవహారం.! కాదు కాదు, ఇది ట్రోలింగ్ కంటెంటే.! చేతిలో పేపర్ స్లిప్ లేకపోవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెల్ఫ్ ట్రోలింగ్ చేసకుంటున్నారు.! ఇదీ ఇలా చర్చ జరుగుతోంది జనంలో.
తెలుగు మీడియాకి.. అందునా, వైసీపీ పెంచి పోషిస్తోన్న ఓ న్యూస్ ఛానల్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారమైంది. లైవ్ ఇంటర్వ్యూ అయితే, అదెలా వుండేదో.! కానీ, ఇక్కడ రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. చాలా కట్స్ అనంతరం బయటకు వచ్చిన ఇంటర్వ్యూలోనే బోల్డంత ట్రోలింగ్ కంటెంట్ జరిగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తుంటారు.? అంటే, దానికీ జగన్ నీళ్ళు నమిలారు.. అది కాస్తా విపరీతమైన ట్రోలింగ్‌కి కారణమవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కావొచ్చు, ఇంకో విషయం గురించి కావొచ్చు.. వైఎస్ జగన్ మాట్లాడిన ప్రతి మాటా ట్రోలింగ్‌కి గురవుతోంది.
ఇదసలు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూయేనా.? అని సాక్షాత్తూ వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకున్నాయి. సంక్షేమ పథకాలు – సోమరి ప్రజలు.. అన్న వ్యవహారంపైనా వైఎస్ జగన్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు.
‘చేయూత అంటే, చేపలు పట్టడం నేర్పించడం..’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలైతే హిలేరియస్ కామెడీని పండిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా.! ఎందుకిలా.? ఐదేళ్ళుగా మీడియా ముందుకు రావడానికి తెగ మొహమాటపడ్డ వైఎస్ జగన్, ఎన్నికల ముందర మీడియా ముందుకొచ్చి వైసీపీని నిండా ముంచేస్తున్నట్లుంది పరిస్థితి.
తమకు నచ్చిన ప్రశ్నలు అడిగించుకుని, వాటికి సమాధానాలు ముందే రాయించుకుని, వాటిని చదివేస్తేనే.. పరిస్థితి ఇలా వుంది. అదే, వైసీపీ అనుకూల మీడియా కాకుండా, వేరే మీడియా సంస్థలు, కాస్త బుర్ర వున్న జర్నలిస్టులు ప్రశ్నలు సంధిస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఏమో.!