Switch to English

పవన్‌ కళ్యాణ్‌ ‘యెల్లో మీడియా’తో అప్రమత్తంగా వుండాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,410FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కృష్ణా జిల్లాలో పర్యటించి, రైతుల సమస్యల విషయమై కలెక్టర్‌కి వినతి పత్రం అందించిన విషయం విదితమే. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రత్యేకించి పేరు చెప్పకుండా, ఆయా నేతల్ని పవన్‌ కళ్యాణ్‌ ‘కెలికిన’ వైనానికి, సదరు నేతలు ఎంతలా గింజుకుంటున్నారో చూస్తూనే వున్నాం.

మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, మీడియా ముందుకొచ్చి, పవన్‌ కళ్యాణ్‌పై షరామామూలుగానే నోరు పారేసుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏ విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీశారన్నది వాళ్ళెవరికీ అనవసరం. ఎందుకంటే, ఆయా విషయాలపై మాట్లాడేంత సీన్‌ వైసీపీ నేతలెవరికీ లేదు మరి.! సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

కానీ, మీడియాకి ఏమయ్యింది.? టీడీపీ అను’కుల’ మీడియా పోషిస్తోన్న పాత్ర ఏంటి.? ఇంకేముంటుంది.? పవన్‌ – వైసీపీ నేతలు భలే తిట్టుకుంటున్నారే.. అంటూ పండగ చేసుకుంటోంది పచ్చ మీడియా. అటు వైసీపీ నేతల్ని ఎగదోస్తోంది.. ఇటు జనసేన నేతల్నీ ఎగదోస్తోంది. జనసేనలో పవన్‌ కళ్యాణ్‌ తప్ప, అంత గట్టిగా మాట్లాడేవారెవరూ వుండరనుకోండి.. అది వేరే సంగతి.

మంత్రుల దగ్గరకీ, వైసీపీ నేతల దగ్గరకీ వెళుతున్న టీడీపీ అను’కుల’ మీడియా, పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ, పవన్‌ని తిట్టించేస్తుండడం గమనార్హం. ఇప్పటికే పలు మార్లు ఈ ఎల్లో మీడియా ‘రంగు’ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బట్టబయలు చేసినా.. బుద్ధి మారడంలేదు.. మారుతుందన్న ఆశ కూడా ఎవరికీ లేదనుకోండి.. అది వేరే సంగతి. అ

సలు పవన్‌ కళ్యాణ్‌ ఏ విషయమ్మీద అధికార పార్టీని నిలదీశారు.? అన్న విషయాన్ని పెద్దగా ఫోకస్‌ చేయలేదు టీడీపీ అను’కుల’ మీడియా. రైతు సమస్యలపై పవన్‌ ఎందుకు నినదించాల్సి వచ్చింది.? అన్న విషయమై చర్చలు పెట్టి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది. అది ప్రజలకు ఉపయోగపడేది. పవన్‌, అంశాల వారీగానే విమర్శించారు. దానికి వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. అలా నోరు పారేసుకోవడంలో ఎవరికి వారే మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసి వుంటారు..

ఈ విషయంలో ఎవరూ ఎక్కువా కాదు, ఎవరూ తక్కువా కాదు. విజ్ఞత అనేది మాత్రమే సెన్సార్‌ పాటించేలా చేస్తుంది. ఈ తిట్ల రాజకీయానికి ఆజ్యం పోసిందే టీడీపీ అను’కుల’ మీడియా. ఆ పైత్యం ఇప్పుడు ముదిరి పాకాన పడిన దరిమిలా, జనసేన అధినేత ఆ ట్రాప్‌లో పడకుండా ఒకింత జాగ్రత్త పడటం మంచిది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

Manjummel Boys: ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత స్పందన

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి...

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన...

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది....

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Kamakshi: ‘బోల్డ్ సీన్స్ అయితే ఏంటీ.. నటిస్తా..’ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Kamakshi: ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). అయితే.. విరుపాక్ష, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్, రౌడీ బాయ్స్, ఓం భీం బుష్ సినిమాల్లో నటించినా.. పొలిమేర,...

AP News: పిన్నెల్లికి 7ఏళ్ల శిక్ష పడొచ్చు.. 10సెక్షన్ల కింద కేసులు: సీఈఓ మీనా

AP News: ఏపీలో పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేయడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం చేసిన ప్రభాస్

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న విడుదల అవుతున్న సినిమాకు సంబంధించి...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...