AP News: ఏపీలో పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేయడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైందని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా (Mukhesh Kumar Meena) స్పష్టం చేశారు. ఈకేసులో రామకృష్ణారెడ్డికి 7ఏళ్ల వరకూ శిక్షపడే అవకాశం ఉందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ..
‘ఈవీఎం ధ్వంసం కేసులో మేమేమీ దాచలేదు. ఘటన మరుసటి రోజే ఆధారాలు పోలీసులకు అప్పగించాం. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. సిట్ కు పోలీసులు ఆధారాలన్నీ అందించారు. రెంటచింతల ఎస్ఐ కోర్టులో 20నే మెమో దాఖలు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఘటనలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. పోలింగ్ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం కాగా.. మాచర్లలోనే 7చోట్ల ధ్వంసమయ్యాయ’ని అన్నారు.
పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసారని లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.