Switch to English

గ్రేటర్‌ ఎఫెక్ట్‌: కేసీఆర్‌.. రోజుకో కొత్త సంచలనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ‘ఆసక్తికరమైన’ నిర్ణయమే తీసుకుంది. తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేకుండానే వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయ్యింది. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు ఎల్‌ఆర్‌ఎస్‌ విషయమై పెద్దయెత్తున వివాదం నడిచింది. ఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవహారానికి సంబంధించి నానా పొలిటికల్‌ యాగీ చోటుచేసుకుంది. గ్రేటర్‌ ఎన్నికల ఎఫెక్టో.. ఇంకో కారణమో.. ఎలాగైతేనేం, కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు ఇబ్బందులు తొలగినట్లయ్యింది.

భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు.. ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటోన్న అవినీతి, అక్రమాల నేపథ్యంలో, ఈ మొత్తం వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లో నినదించారు. ఈ క్రమంలోనే ‘ధరణి’ అంశం తెరపైకొచ్చింది. కొత్త విధానం కంటే, పాత విధానమే బెటర్‌.. అన్న వాదన సర్వత్రా వెల్లువెత్తిన వేళ, కేసీఆర్‌ సర్కార్‌ దిగిరాక తప్పలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతి పెద్ద ఫెయిల్యూర్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఒక్కో అంశం మీదా వెనుకడుగు వేస్తూ.. ప్రభుత్వంపై ఏర్పడ్డ నెగెటివ్‌ ఇమేజ్‌ని తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఇదిలా వుంటే, ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ తాజాగా కొత్త వరాలు ప్రకటించింది. అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సుని పెంచాలంటూ కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

హోంగార్డులు, అంగన్‌ వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు.. గౌరవ వేతనాలు అందుకుంటున్నవారికి కూడా ప్రయోజనం కలిగించేలా వేతనాల పెంపు వుండబోతోందట. సుమారు 9 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని కేసీఆర్‌ ప్రకటించడం గమనార్హం. ఇవే కాదు, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఉద్యోగులకు కేసీఆర్‌ తీపి కబురు చెబుతున్నారు.

కారుణ్య నియామకాల విషయంలోనూ కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇవన్నీ గ్రేటర్‌ ఎన్నికల ఎఫెక్ట్‌ కారణంగానే జరుగుతున్నాయా.? అంటే, అవుననే చెప్పాలేమో.! ఏదిఏమైనా, కేసీఆర్‌లో ఈ మార్పు, తెలంగాణ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దుబ్బాక దెబ్బ, గ్రేటర్‌ ఎన్నికల దెబ్బ.. కేసీఆర్‌లో ఇంతటి మార్పుని తీసుకొచ్చాయన్నమాట.

5 COMMENTS

  1. 597199 688984Hey, you used to write great, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a little bit out of track! come on! 14918

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు గౌరవ డాక్టరేట్.. తమ్ముడు పవన్ కల్యాణ్...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా వుంటున్నాయి ఆ పోస్టులు. పవన్ కళ్యాణ్,...