Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న విడుదల అవుతున్న సినిమాకు సంబంధించి ప్రభాస్ ఇటివల బుజ్జిని పరిచయం చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఈవెంట్ రామోజీ ఫిలింసిటీలో జరిగింది.
ప్రభాస్ మాట్లాడుతూ.. ‘అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan), కమల్ హాసన్ (Kamal Haassan) గారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. భద్రత దృష్ట్యా తక్కువ మంది మధ్యలో ఈవెంట్ చేస్తున్నాం. అభిమానులు అందుకు క్షమించాలి. అశ్వనీదత్ కు డబ్బు భయం లేదు. 50ఏళ్లుగా నిర్మాతగా ఉన్నది ఆయనే. అశ్వినీదత్, నాగ్ అశ్విన్ కు థ్యాంక్స్’ అని అన్నారు.
మొత్తానికి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన బుజ్జి (Bujji) ని ప్రభాస్ పరిచయం చేశారు. హైస్పీడ్ లో దూసుకొచ్చిన బుజ్జి ఆకట్టుకుంటోంది. బుజ్జి.. ఇంకా స్పీడ్ అనడంతో.. మాక్స్ స్పీడ్ అందుకుంటుంది. థాంక్స్ బుజ్జి అని ప్రభాస్ చెప్పడంతో ఓకే అంటూ సరదాలు పంచింది. మొత్తంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ తో బుజ్జి అదిరిపోయిందని చెప్పాలి.