వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ప్రియుడి మోజులో పడిన భార్య ఏకంగా అతడితో కలిసే భర్తను హతమార్చింది. తన జీవితంతోపాటు తన చిన్నారుల జీవితాలను కూడా చీకటిమయం చేసింది. విస్తుగొలిపే ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మండల కేంద్రంలోని గేటుపల్లితండాకు చెందిన దర్యావత్ సింగ్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో వీరి సంసారం సవ్యంగానే సాగింది. జ్యోతికి అప్పల్ రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. దీంతో భర్తను హతమార్చాలని పథకం వేసింది జ్యోతి.
ఇటివల ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్న భర్త ఓరోజు మద్యం సేవించాడు. అదే అదనుగా సాంబరాజుకు ఫోన్ చేసింది. వెంటనే జ్యోతి ఇంటికి చేరుకున్నాడు సాంబరాజు. మద్యం మత్తులో ఉన్న దర్యావత్ సింగ్ మెడకు తాడు బిగించి ఇద్దరూ హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ ట్రాలీలో తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టి బూడిదను సమీపంలోని చెరువులో పారబోశాడు.
తమ్ముడు కనిపించడంలేదని దర్యావత్ సింగ్ అన్న వీరన్న ఈనెల 21న నెక్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జ్యోతిపై అనుమానం వచ్చింది. కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్టు అంగీకరించింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తల్లి చేసిన పనికి తండ్రిని పోగోట్టుకున్న ఆ చిన్నారులకు ఇప్పుడు తల్లి ఉన్నా దూరమైంది.
201170 501845An extremely interesting examine, I may possibly possibly not concur entirely, but you do make some extremely valid points. 605733
766887 866977Awesome blog, Im going to spend much more time researching this subject 509702
835760 402534Visiting begin a business venture around the web generally means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but but to plenty of future prospects who could be over the internet numerous times. effortless internet business 73300
744724 395121Hello. Fantastic job. I did not expect this. This is a outstanding articles. Thanks! 575367
190759 885720I truly appreciated this gorgeous blog. Make confident you maintain up the great work. Finest Regards . 87457