మరో వారంలో కరోనా కేసులు 10 మిలియన్ మార్క్ ను దాటే అవకాశముందని ఇది మరింత పెరుగతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు . కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నాయి అయితే ప్రజలు మాత్రం కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
అదే విధంగా డబ్ల్యూహెచ్ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ ” ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు .రాబోయే రోజుల్లో వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం వుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ” అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం కొవిడ్ మహమ్మారి దక్షిణ ఆసియాలోని లక్షలాది మంది పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వివరించింది.