Switch to English

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.!

ఇంతకీ, ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న జనాల పరిస్థితేంటి.? అసలు రాజకీయ పార్టీల కోసం జనం స్వచ్ఛంందంగా తరలి వచ్చే పరిస్థితి వుందా.? ప్చ్.. లేనే లేదు.! జన సమీకరణ రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఎంత ఖర్చుపెడితే అంత జనం వస్తున్నారు.! సో, ఖర్చు పెరిగిపోతోంది.

పెరిగిపోవడమంటే మామూలుగా కాదు.! వస్తున్న జనాన్ని ఐదొందలు, వెయ్యి.. చొప్పున లెక్కేసుకోవాలి.! ఔను, ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో జనం కనిపించాలంటే, ఒక్కొక్కర్నీ ఐదొందలు, వెయ్యి, పదిహేను వందలు ఇచ్చి రప్పించుకోవాల్సిందే.

క్వార్టర్ బాటిల్ మద్యం, సొంత వాహనాల్లో వచ్చేవారికి పెట్రోల్ కూపన్లు, బిర్యానీ.. ఇవన్నీ అదనం.! అభ్యర్థుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరిగేవారికీ గట్టిగానే చెల్లింపులు చేసుకోవాలి. గంటకు ఇంత మొత్తంలో చెల్లిస్తామంటూ, ఆ విధంగా జనాల్ని మాట్లాడుకుంటున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు ఖర్చు విషయంలో క్రియేట్ చేయబడుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా ఖర్చు చేయాల్సి వస్తోందన్నది నిర్వివాదాంశం. జనసేనకు సంబంధించి, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కారణంగా, ఖర్చు సమస్య వుండదు.. జనాల్ని డబ్బులిచ్చి తరలించాల్సిన అవసరమూ వుండదు.

నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా ఖర్చు అనేది పెద్ద సమస్య కాదు. బాలయ్య అభిమానులూ స్వచ్ఛంగానే తరలి వస్తున్నారు. ఇదేదో తూతూ మంత్రంగా చెబుతున్న విషయం కాదు, గ్రౌండ్ రిపోర్ట్.
ఎన్నికల సమయం, ఆపై వేసవి కాలం.. కూలీలకు పెద్దగా పనులు వుండటంలేదు. కూలి పనులకు వెళితే వచ్చే మొత్తం కంటే, ఎన్నికలకు సంబంధించిన సభలు, రోడ్ షోలు.. వంటి వాటిల్లో పాల్గొంటే ఎక్కువ సొమ్ములు గిట్టుబాటవుతున్నాయి కూలీలకి. ఆ కూలీలే, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుండడం గమనార్హం.

ఉదయం ఒక టీమ్, సాయంత్రం ఇంకో టీమ్.. మధ్యాహ్నం సమయంలో అయితే, ఇంకో టీమ్.. ఇలా రాజకీయ పార్టీలకు చమురు బాగానే వదిలిపోతోంది జనాన్ని రప్పించడానికి. గెలిచాక, అంతకు మించి లాగేయగలమా.? లేదా.? అన్న టెన్షన్ అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
కనిష్టంగా రోజుకి రెండు వేలు, గరిష్టంగా రోజుకి ఐదు వేల రూపాయల వరకు ఈ ఎన్నికల కూలీలకు దక్కుతోందంటే, రాజకీయం ఎంత ఖరీదైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చెల్లింపులు క్యాష్ రూపంలోనే ఎక్కువగా జరుగుతోంది. అంత సొమ్ము, ఎలా తనీఖీల్ని దాటుకుని, రాజకీయ పార్టీల ద్వారా జనాలకు వెళుతోంది.? అన్నదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.

ఇలా, పెయిడ్ కూలీలే పార్టీల కార్యకర్తలుగా కనిపిస్తున్నారు గనుక, ఏ పార్టీకి ఎలా ఓట్లు పడతాయ్.. అన్నదానిపై ఎవరూ ఓ అంచనాకి రాలేకపోతున్నారు. కాగా, పేద కుటుంబాలు మాత్రం, ఎన్నికల సమయంలో తమ కడుపు హాయిగా నిండుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ పిలిస్తే, ఆ పార్టీ వెంట వెళతామని చెబుతున్నారు. అన్నట్టు, మద్యవర్తుల కక్కుర్తి అటు అభ్యర్థులకీ, ఇటు కూలీలకీ శాపంగా మారుతోంది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...