Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ (Jai Hanuman) తెరకెక్కించేందుకు సిద్ధమైంది. హనుమాన్ జయంతి సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు ప్రశాంత్ వర్మ.
‘జై హనుమాన్ షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. సినిమాను ఐమాక్స్ 3డి వెర్షన్ లో తీసుకొస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో రాబోయే సినిమాలన్నీ 3డిలోనే రానున్నాయి. ఈసారి సినిమా మరింత ఉద్విగ్నంగా ఉండబోతోంద’ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ విడుదల చేసిన పోస్టర్లో హనుమాన్ నిలబడి ఉంటే ఆయన ఎదురుగా భారీ డ్రాగన్ నిలబడి ఉంది.
దీంతో చైనా సినిమాల్లోనే డ్రాగన్ కాన్సెప్ట్ ఇప్పుడు భారతీయ సినిమాకూ తీసుకొస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తక్కువ బడ్జెట్లోనే గ్రాఫిక్స్ తో అదరగొట్టి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈసారి ఏస్థాయిలో సినిమా తెరకెక్కిస్తాడోననే చర్చ మొదలైంది.
On this auspicious #HanumanJanmotsav ,
May we all stand against all the adversities and emerge victorious 🔥Experience the epitome of Lord #Hanuman ji‘s EPIC BATTLES in IMAX 3D💥#JaiHanuman @ThePVCU pic.twitter.com/VL94DyyPMj
— Prasanth Varma (@PrasanthVarma) April 23, 2024