కరోనా వైరస్‌: మనిషికి మనిషే శతృవు

కరోనా ఎఫెక్ట్ : 56 కాదు… 6.5 కోట్ల మందికి మరణిస్తారట!!

మొన్న స్వైన్‌ఫ్లూ.. నిన్న ఎబోలా.. ఇప్పుడేమో కరోనా వైరస్‌. ఎక్కడో పుడుతోంది.. అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కంటికి కన్పించని శతృవు ఇది. భూమ్మీద జనాన్ని తగ్గించే క్రమంలో ప్రకృతి నుంచే ఇలాంటి వైరస్‌లు పుట్టుకొస్తున్నాయా.? అంటే కాదు కాదు, మానవ తప్పిదాలే అన్నిటికీ కారణమని అంటారు శాస్త్రవేత్తలు. వైరస్‌ కావొచ్చు, బ్యాక్టీరియా కావొచ్చు.. ఇది మనతోనే వుంటాయి. అవి తమ రూపాల్ని, స్వరూపాల్నీ, స్వభావాల్ని మార్చుకోవడం మానవాళిపై ప్రతాపం చూపడం ఎప్పటినుంచో జరుగుతున్నదే.

మందులు కనిపెట్టాం, కనిపెడుతూ వున్నాం.. కనిపెడుతూనే వుంటాం.. అలాగే కొత్త కొత్త వైరస్‌లు కూడా పుట్టుకొస్తూనే వుంటాయి. కరోనా వైరస్‌ విషయమై ప్రపంచమంతా అలర్ట్‌ అయ్యింది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ అత్యంత వేగంగా ప్రపంచమంతా విస్తరించేస్తోంది. వైద్యరంగం అప్రమత్తమయ్యింది.. నివారించేందుకు చర్యలు ముమ్మరం చేసింది.

వైరస్‌ తెచ్చే నష్టం సంగతెలా వున్నా, సాధారణ జలుబుతోనే ప్రాణాలు కోల్పోయే స్థాయికి ఈ తరహా వైరస్‌లపై దుష్ప్రచారం షురూ అవుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు పండగ చేసుకోవడం మామూలే.

స్వైన్‌ ఫ్లూ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం మందుల్ని అప్పట్లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ జలుబు, జ్వరానికే స్వైన్‌ ఫ్లూ అనుమానం పేరుతో అమాయకుల జేబులకు చిల్లులు పెట్టేశాయి. రేప్పొద్దున్న కరోనా వైరస్‌ పరిస్థితి కూడా ఇదే. నిజానికి కరోనా వైరస్‌ని మనిషే సృష్టించాడా.? అన్న అనుమానాలు తలెత్తుతుండడం మరో ఆసక్తికరమైన విషయం.

చైనా జీవ ఆయుధాల తయారీలో భాగంగా ఈ వైరస్‌ని తయారు చేసిందనీ, ప్రమాదవశాత్తూ అది ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందనీ ఓ వార్త దావానంలా వాప్తి చెందుతోందిప్పుడు. అవును, అణుబాంబుల కంటే ప్రమాదకరమైనవి ఈ జీవాయుధాలు. ఇరాక్‌ యుద్ధం సమయంలో వీటి గురించి విన్నాం. ఈ మధ్య తరచూ వింటూనే వున్నాం. అదే గనుక నిజమైతే.. మనిషికి మనిషే శతృవు అన్న విషయం ఇంకోసారి నిరూపితమవుతుందంతే.